శ్రీ రుక్మిణీశ!కేశవ!
శ్రీరుక్మిణీశ!కేశవ!
నారద సంగీతలోల!నగధర శౌరీ!
ద్వారకనిలయ!జనార్దన!
కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా!
కృష్ణా!నీవు రుక్మిణీపతివి.కేశవుడవు.ద్వారకలో నివసించేవాడివి.జనార్దనుడివి.ఆదిశేషువు పైన పవళించేవాడివి.కాళింది మడుగులో అయిదు తలల శేషువు పైన నాట్యమాడిన శూరుడివి.నారదుని సంగీతానికి మోహితుడైనవాడివి.కరుణతో మమ్మల్ని కాపాడు తండ్రీ!
Comments
Post a Comment