పదునాలుగు భువనంబులు
పదునాలుగు భువనంబులు
కుదురుగ నీ కుక్షి నిల్పుకొని నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా!
కవి కృష్ణుడిని చూసి ఆశ్చర్య పోతున్నాడు.ఎందుకంటే ఇందుకే.ఆయనే ఒక పరబ్రహ్మ అయి పదునాలుగు భువనభాండాలను తన కడుపులో దాచుకున్నాడు.అట్లాంటి ఆయన దేవకి అయిన తన తల్లి,ఒక సామాన్యమయిన మహిళ, ఉదరంలో ఎలా ఒదిగి వుండగలిగాడు అనేదే విడ్డూరమయిన,ఆశ్చర్యం కలిగించే విషయం.
Comments
Post a Comment