నీవే తల్లివి దండ్రివి
నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!
హే కృష్ణా!నీవే నాకు తల్లివి,తండ్రివి.నీవే నాకు తోడు నీడ ఇచ్చేవాడివి.నాకు మంచి స్నేహితుడివి కూడా నువ్వే.నాకు సకలమూ నేర్పించే గురువు కూడా నువ్వే.అన్నిటికన్నా ముఖ్యమయిన నా దేవుడివి కూడా నువ్వే.నువ్వే నాకు పతివి.నాకు మోక్షం చూపించే గతివి కూడా నువ్వే.నేను ఇవన్నీ ఊరికే ముఖస్తుతికి చెప్పడం లేదు.ముమ్మాటికీ నూటికి నూరుపాళ్ళు నిజం.మన తల్లి దండ్రులు ఎంత ఆపేక్షగా,ముద్దుగా మురిపెంగా చూసుకుంటారో,అలానే పరమాత్మ మన ఆలన పాలన చూస్తాడు.
రచయిత ఎవరు?
ReplyDelete