చిలుకనొక రమణి

చిలుక నొక రమణి ముద్దుల చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షము నిచ్చితి నలరఁగ నినుఁ దలంచు జనుల కరుదా కృష్ణా! భగవంతుడు భక్తసులభుడు అంటారు.ఇది ముమ్మాటికీ నిజం.ఒక రమణీమణి ముద్దుగా ఒక చిలుకను పెంచుకుంది.ఆ చిలుకకు తన భర్త పేరు,శ్రీరామ,అని పెట్టుకుంది.దానిని ప్రేమగా శ్రీరామ,శ్రీరామ అంటూ పిలుచుకుంటూ ఉండేది.ఆ మాత్రానికే భగవంతుడు ఆమెకు మోక్షం ప్రసాదించాడు.శ్రీరామ అనే మంత్రం ఎంత శక్తిమంతము అయినదో అర్థం అవుతుంది కదా!అంత సునాయసంగా మోక్షం ప్రసాదించే భగవంతుడికి,ఆయనను కొలిచే భక్తులకు కొరత,కొరవ ఉంటుందా!!?

Comments

Popular posts from this blog

నీవే తల్లివి దండ్రివి

శ్రీ రుక్మిణీశ!కేశవ!

పదునాలుగు భువనంబులు