క్రూరాత్ముఁ డజామిళుఁడు

క్రూరాత్ముఁ డజామీళుఁడు నారాయణ యనుచు నాత్మ నందనుఁ బిలువన్ ఏరీతి నులుకొంటివి ఏరీ నీ పాటి వేల్పు లెందును కృష్ణా! అజామిళుడు దారి తప్పి,చెడు మార్గంలో జీవించాడు.కానీ జీవిత చరమాంకంలో,యమభటులు తనను తీసుకెళ్ళేదానికి వచ్చారు.అప్పుడు తన చిన్న కొడుకు పేరును నారాయణ, నారాయణ అని పిలిచాడు.అతనికి యమదూతలు,విష్ణుదూతల సంవాదం వినిపిస్తుంది.దానితో అతని అజ్ఞానపు పొరలు పటాపంచలు అవుతాయి.అతను తన శేష జీవితాన్ని భక్తి మార్గంలో గడుపుతాడు.అంటే దేవుడినామం యొక్క మహత్త్వం తెలుస్తుంది.అజామిళుడు దేవుడి స్మరణ చేయలేదు.దేవుడి పేరు తన కుమారుడికి పెట్టుకున్నందున,అతని పేరు ఉచ్ఛరించాడు.అయినా దేవుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందుకే ఓ కృష్ణా!నీకు సాటి వేరే ఏ ఇతర దేవుళ్ళు లేరు.

Comments

Popular posts from this blog

నీవే తల్లివి దండ్రివి

శ్రీ రుక్మిణీశ!కేశవ!

పదునాలుగు భువనంబులు