అక్రూరవరద!మాధవ!
అక్రూరవరద!మాధవ!
చక్రాయుధ!ఖడ్గపాణి!శార్ఞి!ముకుంద!
శక్రాది దివిజ సన్నుత!
శుక్రార్చిత!నన్నుఁగరుణ జూడుము కృష్ణా!
హే కృష్ణా!మాధవా!నీవు అక్రూరుడు మొదలైన భక్తులను కాపాడి,వారి కోర్కెలను తీర్చావు.చక్రము,ఖడ్గము మొదలైన ఆయుధాలను థరించి ఉంటావు.ధనములనొసగే శ్రీమహాలక్ష్మికి భర్తవు నీవు.ఇంద్రుడు మొదలైన దేవతలను,ఇతర దేవగణాలను కూడా రాక్షసుల బారి నుండి పలుమార్లు కాపాడావు.వాళ్ళందరూ నిన్ను ఎప్పుడూ కీర్తిస్తూ,భజిస్తూ ఉంటారు.హే ముకుందా!భక్తవరదా!నన్నుకూడా నీ చల్లని కరుణా కటాక్షాలతో చూడు స్వామీ!నా జన్మ ధన్యం అయేలా చేయి జగత్ రక్షకా!
Comments
Post a Comment