నందుని ముద్దుల పట్టిని
నందుని ముద్దులపట్టిని మందర గిరిధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నిను దలతు భక్తవత్సల!కృష్ణా!॥8॥ కృష్ణా!నీవు నందుడి ఇంట వెలిసిన వాడవు.వాళ్ళ గారాలపట్టివి,ముద్దుల బిడ్డవు.చిటికెన వేలు మొనపై సునాయాసంగా మందర గిరిని ఎత్తుకున్నవాడవు.నీకున్న సహస్రనామాలలో హరి,మాధవుడు,విష్ణువు అనేవి మచ్చుకు కొన్ని నామాలు.సుందరమయిన రూపం కలిగిన మేఘశ్యాముడవు.నిన్ను మునులు,ఋషులు,దేవతలు,ఇతర గణాలు సదా పూజిస్తూ ఉంటారు. హే భక్తవత్సలా!హే కృష్ణా!నిన్ను నేను సర్వవేళలలో స్మరిస్తూ ఉంటాను.నన్ను కరుణించు తండ్రీ!